హస్తం అంతం అవసరం
చత్తీస్ గఢ్ ప్రజల నిర్ణయం సీఎం విష్ణుదేవ్ సాయ్
రాయ్ పూర్: నక్సలైట్లను అంతం చేయడానికి ముందు హస్తం పార్టీ అంతం అవసరమని చత్తీస్ గఢ్ ప్రజలు నిర్ణయించుకున్నారని సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. ఓటు వేసేందుకు మరో 12 మిగిలి ఉండగా ఆయన మీడియాతో గురువారం చిట్ చాట్ ద్వారా మాట్లాడారు. 29 మంది నక్సలైట్లను హతమార్చడాన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ విచారణకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ ప్రజలు భూ స్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నక్సల్స్ ను హస్తం పార్టీ ఆది నుంచీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ మహతారీ అమాయక కుమారుల రక్తంతో నక్సలైట్లు బస్తర్ భూమిని ఎర్రగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదం, నక్సలిజం, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకమని ఆది నుంచీ చెబుతూ వస్తోందన్న విషయాన్ని సీఎం సాయ్ గుర్తు చేశారు.