57 లోక్ సభ, 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్
ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.6 కోట్ల మంది ఓటర్లు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏడో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేసినట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 8 రాష్ర్టాలు , 57 లోక్ సభ స్థానాలు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1 (శనివారం)న పోలింగ్ నిర్వహించనుంది. 41 స్థానాలు జనరల్, ఎస్టీ–3, ఎస్సీ, –13 స్థానాలను కేటాయించింది. 10.9 లక్షల మంది అధికారులు, 1.09 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొత్తం 10.6 కోట్ల మంది ఓటర్లుండగా, పురుషులు 5.24 కోట్లు, 4.82 కోట్ల మహిళా ఓటర్లుండగా, థర్డ్ జెండర్ 3547 మంది ఉన్నట్లు తెలిపింది. ఈ ఎన్నికలకు 13 ప్రత్యేక రైళ్లను నడపనుండగా 8 హెలికాప్టర్లలో ఎన్నికల సామాగ్రి, సిబ్బందిని తరలించామని తెలిపింది. మొత్తం 172 మైక్రో అబ్జర్వర్ల బృందాలను ఏర్పాటు చేసింది. 2707 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 2799 ఆర్థిక సర్వేలెన్స్ బృందాలు, 1080 సర్వేలెన్స్ బృందాలు, 560 వీడియో బృందాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో 201 చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా, ఎన్నికలు నిర్వహించనున్న అన్ని ప్రాంతాల్లో 906 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.