నలుగురు బీఆర్ఎస్ నేతలపై కేసులు
A case has been registered against four BRS leaders
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చర్యలు
నా తెలంగాణ, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో నలుగురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యేలు పద్మారావు, మాగంటి గోపినాథ్, రాజయ్యపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈసీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా వీరు ఇటీవల చార్మినార్ వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తెలంగాణ చిహ్నం నుంచి చార్మినార్ ను, కాకతీయుల కళా తోరణాన్ని తొలగించడంపై ధర్నా నిర్వహించారు. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసీ అనుమతి లేకుండా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించకూడదు. నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. దీంతో చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా చేసినందుకు ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.