వీకే పాండియన్​ రాజకీయాలకు రాజీనామా

పట్నాయక్​ సన్నిహితుడిగా పేరు బీజేడీ ఓటమితో నైరాశ్యంలో వీకేపీ

Jun 9, 2024 - 17:58
 0
వీకే పాండియన్​ రాజకీయాలకు రాజీనామా

భువనేశ్వర్​: నవీన్​ పట్నాయక్​ కు అత్యంత సన్నిహితుడు, ఆయన తరువాత రాజకీయ బాధ్యతలు చేపట్టనున్న వారు అని పేరున్న వీకే పాండియన్​ బిజూ జనతాదళ్​ (బీజేడీ)కి రాజీనామా ప్రకటించారు. అంతేగాక ఇక రాజకీయాలను సైతం పూర్తిగా విడిచి పెడుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీకే పాండియన్​ వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేశాయి. దీంతో మనస్థాపం చెందిన పట్నాయక్​ పార్టీ నుంచే కాకుండా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలన్నారు. పార్టీ ఓటమికి చింతిస్తున్నానని తెలిపారు. బీజేడీ పార్టీ కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. కాగా బీజేడీ ఓటమి అనంతరం సీఎం పట్నాయక్​ రాజీనామా సమర్పించేందుకు గవర్నర్​ వద్దకు వెళ్లగా అక్కడ కూడా వీకే పట్నాయక్​ కనిపించలేదు. మరోవైపు పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా ఆయన దూరంగానే ఉన్నారు.  
ఒడిశాలో 24 యేళ్ల తరువాత బీజేడీ ఘోర ఓటమిని చవి చూసింది. నవీన్​ పట్నాయక్​ ను నమ్ముకున్న ఒడిశా ప్రజలు ఈసారి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. 147 స్థానాలున్న ఒడిశాలో బీజేపీకి 78 స్థానాలను కట్టబెట్టారు. బీజేడీకి 51 స్థానాలు, కాంగ్రెస్​ కు 15, ఇతరులకు 3 స్థానాలు మాత్రమే దక్కాయి.