సీఎం ఫడ్నవీస్ ఖరారే? ఆజాద్ మైదానంలో 5న ప్రమాణ స్వీకారం
Is CM Fadnavis final? Swearing in at Azad Maidan on 5th
అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్
స్వగ్రామంలో షిండేకు అనారోగ్యం, విశ్రాంతి
సోమవారం శాసనసభా పక్ష నేత ఎన్నిక
ముంబాయి: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారైంది. అధికారిక ప్రకటనలో జాప్యం ఏర్పడుతుంది. డిసెంబర్ 5న ముంబాయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్ ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే, రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ శనివారం ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిత్రపక్షాలు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే సీఎంగా ఫడ్నవీస్ పేరును మాత్రం నార్వేకర్ ప్రకటించలేదు.
తాత్కాలిక సీఎం ఏక్ నాథ్ షిండే సీఎం కాకపోతే, ఆర్థిక, హోంమంత్రిత్వ శాఖ లాంటి పెద్ద పదవులను ఆశిస్తుండడంతో పేచీ నెలకొన్నట్లు సమాచారం. అయితే శుక్రవారం సమావేశం అనంతరం షిండే తన స్వగ్రామం సతారాకు వెళ్లారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. స్వగ్రామంలో విశ్రాంతి కోసం వెళ్లారు. శనివారం ప్రత్యేక వైద్యులు ఆయన్ను పరీక్షించారు. రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో షిండే ప్రచారం సందర్భంగా సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపారు.
సోమవారం శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ సమావేశం కానుంది. ఆ తరువాతే సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. సీఎం పేరు ప్రకటన అనంతరమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరనున్నారు. అదే సమయంలో మంత్రి పదవుల నిర్ణయం మంగళవారంనాటికి ఫైనల్ చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు.