నిర్భయంగా ఓటేయండి ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్
రెండోదశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ: రెండోదశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోసం గత రెండేళ్ల నుంచి ఏర్పాట్లు కొనసాగాయని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఎక్కడి నుంచి ఎలాంటి హింసాయుత ఘటన చోటు చేసుకోలేదన్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ బూత్ లో సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చామని రాజీవ్ కుమార్ తెలిపారు.