జూలై 26న లోక్​ సభ స్పీకర్​ ఎన్నిక

Election of Lok Sabha Speaker on July 26

Jun 13, 2024 - 21:51
 0
జూలై 26న లోక్​ సభ స్పీకర్​ ఎన్నిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు లోక్​ సభ స్పీకర్​ ఎన్నిక ఎప్పుడు జరగనుందో తేదీ ఖరారైంది. గురువారం అందిన వివరాల ప్రకారం జూన్​ 26న లోక్​ సభకు స్పీకర్​ ను ఎన్నుకోనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జూన్‌ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతుందని కొత్త పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్​ రిజిజు తెలిపారు. ఇందులో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఎన్నిక జరగనుంది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగనుంది. సెషన్‌లో మొదటి మూడు రోజుల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారని రిజిజు తెలిపారు. అంతేకాకుండా సభాపతిని కూడా ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి, రోడ్‌మ్యాప్‌ను ప్రదర్శిస్తారు. పార్లమెంటు సమావేశాలు జూలై 3తో ముగియనున్నాయి.