రెండోదశలో 15.88 కోట్ల మంది ఓటర్లు

8.8 పురుషులు, 7.8 మహిళలు, 5929 ఇతరులు 1.67 లక్షల పోలింగ్​ కేంద్రాలు, సగం కేంద్రాల్లో వెబ్​ కాస్టింగ్​ మూడు హెలికాప్టర్లు, నాలుగు రైళ్లు, 80వేల వాహనాలు ఏర్పాటు

Apr 26, 2024 - 07:56
 0
రెండోదశలో 15.88 కోట్ల మంది ఓటర్లు

న్యూఢిల్లీ: రెండో దశలో జరుగుతున్న ఎన్నికల్లో 15.88 కోట్ల మంది ఓటర్లున్నారు. 8.8 కోట్ల మంది పురుషులు కాగా, 7.8 కోట్ల మంది మహిళలు, ఇతరులు 5929 మంది ఓటర్లున్నారు. 1.67 లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 శాతం కంటే ఎక్కువ పోలింగ్​ స్టేషన్లలో వెబ్​ కాస్టింగ్​ ద్వారా ఈసీ పర్యవేక్షిస్తోంది. 34.8 లక్షల మంది నూతనంగా పేర్లు నమోదు చేయించుకున్న ఓటర్లున్నారు. 20–29 యేళ్ల వయస్సు వారు 3.28 కోట్ల మంది ఓటర్లున్నారు. మూడు హెలికాప్టర్లు, నాలుగు ప్రత్యేక రైళ్లను ఎన్నికల ఏర్పాట్ల కోసం సామాగ్రి, అధికారుల తరలింపు కోసం ఈసీ ఏర్పాటు చేసింది. 80 వేల వాహనాలను సమకూర్చింది. 85 యేళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారు 14.78 లక్షల మంది ఓటర్లు ఉండగా వంద యేళ్లు, పై బడిన వారు 42,226 మంది ఉండడం విశేషం. 14.7 లక్షల మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా వీల్​ చైర్లు, సహాయకులు, వాహనాలను ఈసీ ఏర్పాటు చేసింది. 4195 మోడల్​ పోలింగ్​ స్టేషన్లుండగా, 4100 పోలింగ్​ కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులే నిర్వహిస్తున్నారు. 640 పోలింగ్​ స్టేషన్లు దివ్యాంగ అధికారులే నిర్వహిస్తుండడం విశేషం. 

సదుపాయాలు..

తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం షెడ్లు, ర్యాంపులు, వీల్​ చైర్లు, సహాయకులు, అంబులెన్సు, వైద్య సిబ్బందు, మందులు, ఓటు ఎలా వేస్తారనే దానిపై అవగాహన, సహాయం కోసం ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులను ఈసీ ఏర్పాటు చేసింది.