తెలుగు సాహిత్య చరిత్రలో విశ్వంభరుడు సినారే 

నేడు సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి

Jul 29, 2024 - 00:18
 0
తెలుగు సాహిత్య చరిత్రలో విశ్వంభరుడు సినారే 

తెలుగు సాహితీ సమైక్యతను భరతజాతి సమగ్రతను తన సాహిత్యం ద్వారా అఖండ ప్రఖ్యాతి చేకూర్చారు సినారే. ‘నా పేరు కవి, ఇంటిపేరు చైతన్యం, ఉదయం నా హృదయం, తేజస్సు నా తపస్సు, తూర్పున ఓర్పు, మార్పు నా తీర్పు, నా వచనం బహువచనం, ఊరు సహజీవనం, తీరు సమబావనం’, అని గళమేత్తి తన కవిత్వ వ్యక్తిత్వాన్ని చాటిన సాహితీ మూర్తి సినారే. ‘ఆ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగినో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగిననో’, ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి’, ‘తెలుగు జాతి నాది.. నిండుగా వెలుగు జాతి మనది’ అంటూ మొదలైన సినారే సాహితీ ప్రస్థానం పాటైనా, పద్యమైనా, గేయమైన, గజలైనా, తెలుగు సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియలను అలవోకగా రాయగల సాహితీ యోధుడు సహృదయుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి. సింగిరెడ్డి నారాయణరెడ్డి, లేదా సినారే అని ప్రసిద్ధిగా పిలువబడే ఈ మహాకవి తెలుగు సాహిత్యాన్ని ఒక కొత్త మలుపు తిప్పారు. ఆయన కవిత్వం, వ్యాసాలు, నాటకాలు, అనువాదాలు ఇలా అన్ని రంగాల్లోనూ తన ప్రభావం చూపించారు. సినారే కవిత్వం కేవలం మాటల సముదాయం కాదు..  అది జీవితం.. సమాజం.. మానవ సంబంధాల గురించి లోతైన ఆలోచనలను కలిగి ఉంటుంది. 

సినారే ప్రస్థానం..
సినారే 1931 జులై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన హనుమాజీపేటలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. మారుమూల పల్లె నుంచి మొదలైన తన విద్యాభ్యాసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి. విద్యార్థిగా ఉన్న దశలోనే శ్రీకృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాన్ని రచించారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ అందుకొని అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉద్యోగాన్ని ప్రారంభించి. ఒకవైపు ఉద్యోగం, మరొకవైపు సాహితి ఉద్యానవనాన్ని సమతుల్యంగా నడుపుతూ, తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ శిఖరాగ్రస్థాయికి చేర్చారు. సినారే కవిత్వం ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఆయన కొత్త కొత్త ప్రక్రియలను ప్రయత్నించి, తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేశారు. ఆయన కవిత్వంలో సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యలు, ఆశయాలు ప్రతిబింబిస్తాయి. సినారే భాష సరళంగా, అందంగా ఉంటూనే అర్థవంతంగా ఉంటుంది. ఆయన భాషలో ఒక శక్తి ఉంది. ఆయన కవిత్వం ప్రేమ, విరహం, స్నేహం, జీవితం, మరణం, సమాజం, రాజకీయాలు ఇలా అన్ని అంశాలను తాకుతుంది. సినారే కవిత్వంలో ప్రయోగాత్మకత ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన కొత్త కొత్త ప్రయోగాలతో తెలుగు కవిత్వాన్ని మరింత ఆసక్తికరంగా మార్చారు.

 సాహిత్య చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం
సినారే తెలుగు సాహిత్యంపై చూపించిన ప్రభావం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఆయన కవిత్వాన్ని అనేక భాషల్లోకి అనువదించారు. ఆయన కవిత్వం కేవలం తెలుగు వారికే కాకుండా అన్ని భాషల వారికీ స్ఫూర్తిగా ఉంది. సినారే తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. ఆయన కవిత్వం కేవలం ఒక కాలానికి చెందినది కాదు, అది అజరామరం. ఆయన కవిత్వాన్ని చదివితే మనం జీవితం గురించి, సమాజం గురించి మరింత లోతుగా ఆలోచించేలా ప్రేరేపిస్తాము. సినారే ప్రపంచ పదులు ఆయన కవిత్వంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. సినారే తెలుగు నాదం తెలుగు స్వరం కవితా సముద్రం అక్షరాల వెల్లువ ‘విశ్వంభర’ తెలుగు సాహిత్యంలో ఒక మలుపు మానవ పరిణామ క్రమం నుంచి ఆధునిక సాంకేతిక విజ్ఞానం వరకు ఈ భూగోళంపై జరిగిన తాత్విక, రాజకీయ, ప్రకృతి, దైవత్వని, తన తత్వంతో కవిత్వంతో  విశ్వవ్యాప్తం చేశారు సినారే. 1988వ సంవత్సరంలో సీనారే రాసిన విశ్వాంభర సాహితీ ప్రస్థానానికి భారత అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు లభించడం తెలుగు భాషకు తెలంగాణ జాతికి గర్వకారణంగా చెప్పవచ్చు. 

సినారే రచనలు..
సినారే ప్రముఖ రచనలు విశ్వంభర, కలం సాక్షిగా, నాగార్జున సాగర్, కర్పూర వసంత రాయలు, మట్టి మనిషి ఆకాశం, తేజస్సు తపస్సు, మాటలు మానవుడు, రెక్కల సంతకాలు, పరిణత వాణి సినారే గేయాలు నాటికలు అనేకం ప్రసిద్ధి చెందిన రచనలు ఉన్నాయి. సీనారే సినీ సాహిత్యానికి వస్తే 1962లో మొదలైన గులేబకావళి చిత్రం నుంచి 2011 ఇంకెన్నాళ్లు చిత్రం వరకు కొన్ని వందల పాటలను తెలుగు సినిమాకు అందించారు. ప్రముఖ చిత్రాలైన రక్తసంబంధం, తిరుపతమ్మ కథ, గుడిగంటలు, రాముడు భీముడు, బంగారు గాజులు, అల్లూరి సీతారామరాజు, స్వాతిముత్యం, ప్రేమించు, అరుంధతి మొదలగు చిత్రాలకు అద్భుతమైన పాటలను అందించారు. స్వాతిముత్యం సినిమాలో లాలి పాట, ప్రేమించు సినిమాలో కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, అరుంధతి సినిమాలో జేజమ్మ తెలుగు సినిమా సాహిత్యంలో మరువలేని గేయాలు ఎన్నో అందించారు. 

అవార్డులు, పురస్కారాలు..
సినారే సాహితీ ప్రస్తానానికి ఎన్నో అవార్డులు పురస్కారాలు అందివచ్చాయి. 1988 జ్ఞానపీఠ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, పద్మశ్రీ, పద్మభీషణ్ పురస్కారం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు డాక్టరేట్ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాంస్కృతిక రంగా విశిష్ట పురస్కారం, ఆంధ్ర కాకతీయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 
 
పదువులకే వన్నే.. 
1981లో ఆంధ్ర అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా,1985లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా, 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాత 1997 నుంచి ఆరు సంవత్సరాలు పాటు రాజ్యసభ సభ్యుడుగా తన పదవులను నిర్వహించారు. విశ్వ మానవ హృదయాంతరాలలో చైతన్య జలపాతాల సవ్వడిని విప్లవ జ్వాలలతో వేడిని రగిలించిన కవిత జగత్తులో చైతన్య పతాకం సినారే. 

పూసపాటి వేదాద్రి 
కవి సాహితీ విశ్లేషకులు 
9912 197 694