వయోనాడ్ రసవత్తరమే
నేడే ప్రియాంక నామినేషన్ నవ్య వర్సెస్ ప్రియాంక
బెంగళూరు: వయోనాడ్ సీటు నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లను చేసింది. ప్రియాంక గాంధీ వాద్రా నామనేషన్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖార్గేలు హాజరుకానున్నారు. మంగళవారమే వారంతా వయోనాడ్ చేరుకున్నారు.
కాగా ఈ స్థానంలో బీజేపీ నవ్య హరిదాస్ (39) ను రంగంలోకి దింపింది. నవ్య ప్రస్తుతం కోజికోడ్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్, బీజేపీ మహిళామోర్చా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన నవ్యకు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఊహించలేదు. మరోవైపు నవ్యకు టిక్కెట్ లభించడంలో వయోనాడ్ లో రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి. ఎంతోమంది పోటీలో ఉన్నా కాదని బీజేపీ అధిష్ఠానం ప్రియాంకతో పోటీకి మహిళా అభ్యర్థినే రంగంలోకి దింపింది.