భారత ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
పాట్నా: భారత ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పాట్నాలో రెండు రోజుల ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ --– 2024ను మంగళవారం మంత్రి షెకావత్ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. 2029 నాటికి వ్యవస్థీకృత పర్యాటక రంగం ప్రస్తుతం ఉన్న 250 బిలియన్ డాలర్ల నుంచి 500 యూఎస్ బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అన్నారు. ఈ రంగంలో అపారమైన అవకాశాల సృష్టి సాధ్యపడుతుందన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం ఇంజన్ గా మారనుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధిలో పర్యాటక రంగాన్ని చేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి షెకావత్ కృతజ్ఞతలు తెలిపారు.