భారతీయులను వెనక్కి తెస్తాం

మోసపూరితంగా వ్యవహరించిన వారిని వదలం.. విదేశాంగ శాఖ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​

Mar 8, 2024 - 18:12
 0
భారతీయులను వెనక్కి తెస్తాం

నా తెలంగాణ, ఢిల్లీ: రష్యాలో మోసపూరితంగా చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువస్తామని విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో వారిని మోసపూరితంగా అక్కడికి తరలించిన ఏ ఒక్కరిని వదలిపెట్టబోమన్నారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రణధీర్​ స్పష్టం చేశారు. తాము రష్యా అధికార యంత్రాంగంతో భారతీయులను క్షేమంగా తీసుకువచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు. త్వరలోనే వారంతా సురక్షితంగా భారత్​కు తిరిగి వస్తారని స్పష్టం చేశారు.