వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం
Financial assistance for medical expenses
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన మూడు సంవత్సరాల వయసున్న చేతి దుర్గ వరుణ్ పసివాడి వైద్య ఖర్చుల కోసం ఆదివారం ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. పేద కుటుంబానికి చెందిన చేతి శ్యామ్ చిన్న కుమారుడు వరుణ్ కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడగా, ఒళ్లంతా తీవ్రగా మారింది. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి. శ్యామ్ శైలజ దంపతుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందించినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు కాయం తిరుపతి తెలిపారు.ఆర్థిక సహాయం అందించిన వారి వెంట గౌరవ అధ్యక్షుడు సట్ల మహేందర్, జెట్టి శ్రీనివాస్, బండారి భూమేష్, బీనవేన సంపత్, మోటం తిరుపతి, బొక్కల తిరుపతి, వెంకటేష్ ఉన్నారు.