మలుపు తిరుగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారం

The twisting Basara triple IT affair

Oct 5, 2024 - 15:19
 0
మలుపు తిరుగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ వ్యవహారం

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ  వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చీఫ్ వార్డెన్ పై ఆరోపణలు చేస్తూ రెండు రోజుల క్రితం. వెలువడ్డ కరపత్రం దరిమిలా చీఫ్ వార్డెన్ కు మద్దతు తెలుపుతూ శుక్రవారం రాత్రి ట్రిపుల్ ఐటీ తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ సాలిడారిటీ (టిఎస్ఎఎస్ ) సంఘం అధ్యక్షుని పేరిట పత్రిక ప్రకటన విడుదల చేశారు. చీఫ్ వార్డెన్ గా శ్రీధర్ పనిచేస్తున్నప్పటినుంచి కేర్ టేకర్లను ఎక్కువ సంఖ్యలో నియమించాలని రాతపూర్వకంగా తెలిపినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిది వేల మంది విద్యార్థులకు కేవలం నలుగురు కేర్ టేకర్లు మాత్రమే ఉన్నట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ తనిఖీల్లో కూడా తేలిందని వారు పేర్కొన్నారు. వీసీ ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి చీఫ్ వార్డెన్ పై కావాలని నిందలు మోపుతున్నారని వారు ఆ ప్రకటనలో ఆరోపించారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న ఘటనలు పాలనాపరమైన, పర్యవేక్షణలోపం వల్లే జరుగుతున్నాయని వారు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. చీఫ్ వార్డెన్ అందించిన ఆధారాలను పరిగణన లోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు.