నా తెలంగాణ, ఆదిలాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ధీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రి ఎదుట గల చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళ్లర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ అభివర్ణించారు.ఆమె ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, కలాల శ్రీనివాస్, సంద నర్సింగ్, యెల్మెల్వార్ అర్చన - రామ్ కుమార్, బీసీ సంఘం అధ్యక్షులు దత్తు, నాయకులు పోరెడ్డి కిషన్, సింగిరెడ్డి రామ్ రెడ్డి, ఓరగంటి అఖిల్, అనుముల ఉదయ్ కిరణ్, కుర్ర నరేష్,బండారి చిన్నయ్య, సంజీవ్ రెడ్డి, అశోక్, లాస్మన్న, సమీర్ అహ్మద్, ఎల్మ రామ్ రెడ్డి, సంతోష్ మహిళా నాయకురాలు రమ, ఉమా,గంగమణి తదితరులు పాల్గొన్నారు.