భైంసాలో ప్రశాంతంగా అమ్మవారి శోభాయాత్ర
A peaceful procession of the Goddess in Bhainsa
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాలో దుర్గాదేవి శోభాయాత్ర ఆదివారం ప్రశాంతంగా ప్రారంభం అయింది. ముధోల్ ఎంఎల్ఏ రామారావు పటేల్, నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఎ ఎస్పీ అవినాష్ కుమార్ లు సార్వజనిక్ దుర్గా దేవి విగ్రహం వద్ద పూజలు చేసి ఈ శోభాయాత్ర ను ప్రారంభించారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 300 మందికి పైగా పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. శోభాయాత్రలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.