పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ అభిలాష అభినవ్
నా తెలంగాణ, నిర్మల్: జిల్లాలో పోడుభూముల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వివిధ శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి కొండా సురేఖ రాష్ట్ర కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు పోడు పట్టాల కోసం మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గ్రామాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.