ఈడీపై దాడి డైరెక్టర్​ కు గాయాలు

Director injured in attack on ED

Nov 28, 2024 - 13:39
Nov 28, 2024 - 15:04
 0
ఈడీపై దాడి డైరెక్టర్​ కు గాయాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సైబర్ క్రైమ్​ ను దర్యాప్తు చేస్తున్నఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై దాడి జరిగింది. గురువారం బిజ్వాసన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు, కుటుంబ సభ్యులు ఈడీ బృందంపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈ లోగా దాడికి ప్రధాన నిందితుడు అశోక్ శర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో అసిస్టెంట్ డైరెక్టర్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను స్థానిక ఆసుపత్రికి వెంటనే చికిత్స నిమిత్తం. ఐదుగురు నిందితులు దాడికి యత్నించారని, ఒకరు పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు. పరాకారి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు జరుగుతున్నాయి.