అణుబాంబుల నిర్వహణకు డబ్బులేవి? ప్రజలను భయపెడతారా?

మాఫియాలు చనిపోతే ఫాతిహాలు సమర్పిస్తారా? బుందేల్​ ఖండ్​ లో డిఫెన్స్​ కారిడార్​ పెద్ద దేశాలతో పెట్టుకుంటే పరిణామాలేంటో రుచి చూపిస్తాం యూపీ హాజీపూర్​ సభలో ప్రధాని మోదీ

May 17, 2024 - 18:57
 0
అణుబాంబుల నిర్వహణకు డబ్బులేవి? ప్రజలను భయపెడతారా?

లక్నో: పాక్​ వద్ద అణుబాంబు ఉందని విపక్ష పార్టీలు మరోమారు మోదీ ప్రభుత్వాన్ని, దేశ ప్రజలను భయపెట్టేందుకు దిగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. కానీ విపక్షాలకు తెలియని విషయం ఏమిటంటే పాక్​ వద్ద అణుబాంబు నిర్వహణకు కూడా డబ్బులు లేవన్న సంగతి వీరికి తెలియదని విమర్శించారు. మాఫియా, రౌడీలు చనిపోతే వెళ్లి ఫాతిహాలు సమర్పించుకునే నాయకులు దేశ ప్రజలను భయపెట్టడం మానుకోవాలన్నారు. ఒక్కసారి బుందేల్​ ఖండ్​ కు వచ్చి మన డిఫెన్స్​ కారిడార్​ పనులను చూసి వెళ్లాలన్నారు. ఆ మాత్రం ఖర్చు పెట్టే స్థాయి కూడా లేని పాక్​ గురించి విపక్షాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఆర్థికంగా ఎదిగిన, శక్తివంతమైన దేశాలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తాము రుచి చూపిస్తున్నామని అన్నారు. బుందేల్​ ఖండ్​ వీరుల భూమి అని మోదీ పేర్కొన్నారు. 

శుక్రవారం ఉత్తరప్రదేశ్​ హాజీపూర్​ లో సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. బుందేల్​ ఖండ్​ వీరుల భూమి అని ఎవ్వరూ భయపడేవారు లేరన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం డిఫెన్స్​ కారిడార్​ తోపాటు,కెన్-బెత్వా లింక్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలో నీటి సమస్య తగ్గించేందుకు రూ. 40 వేల కోట్లతో పథకం అమలు చేస్తున్నామన్నారు. 

కళ్యాణ్​ సింగ్​ గొప్పనాడకుడని మోదీ తెలిపారు. నిరుపేదల సమస్యలపై నిరంతరం పోరాడేవారన్నారు. వారి సంక్షేమానికి విలువనిచ్చేవారన్నారు. 
కాంగ్రెస్​, ఎస్పీ పార్టీలు మాత్రం ఉగ్రవాదం, రౌడీయిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం బహుమతులు కూడా పంపిణీ చేస్తున్నాయన్నారు. ఒక్కసారి వారు అధికారంలోకి వస్తే ఇక నిరుపేదలను వెనక్కి తిరిగి కూడా చూడరన్నది తెలుసుకోవాలని పేర్కొన్నారు. 

దేశంలోని అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూ దేశంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నామన్నారు. మరోవైపు కాంగ్రెస్​, కూటమి పార్టీలు యువతను పెడదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కానీ మోదీ ఉండగా భారత్​ లోని యువ శక్తీని నిర్వీర్యం కానియ్యబోడన్నారు. వారి శక్తి ఎన్నో తరాలుగా ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతాడన్నది విపక్షాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు.