కజకిస్తాన్​ లో ఘోర విమాన ప్రమాదం

రన్​ వేపై పేలిపోయిన విమానం 42 మంది మృతి

Dec 25, 2024 - 13:33
Dec 25, 2024 - 14:20
 0
కజకిస్తాన్​ లో ఘోర విమాన ప్రమాదం

అస్తానా: కజకిస్థాన్​ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. అకాటు విమానాశ్రయంపై విమానంలో మంటలంటుకొని పేలిపోయింది. బుధవారం అజర్​ బైజాన్​ విమానాశ్రయం బాకు నుంచి 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ఎంబ్రాయర్​ 190 జె–28243 విమానం రష్యాలోని గ్రోంజ్నీకి  బయలుదేరింది. విమానం బయలుదేరగానే సాంకేతిక లోపం, వాతావరణం అననుకూల పరిస్థితులతో ల్యాండింగ్​ కు అనుమతి కోరారు. దీంతో ఎయిర్​ లైన్స్​ అధికారులు కజకిస్తాన్​ అకాటు విమానాశ్రయంలో అత్యవసంగా ల్యాండింగ్​ కు అనుమతించారు. విమానం ల్యాండింగ్​ అవుతుండగా పక్షులను కూడా ఢీకొట్టింది. అత్యంత వేగంతో రన్​ వై పై దిగి దిగగానే భారీగా మంటలంటుకొని పేలిపోయింది. వెంటనే విమానాశ్రయ రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పారు. 12 మందిని రక్షించగలిగారు.