హైకోర్టు భవన నిర్మాణానికి రేపే సీఎం శంకుస్థాపన?

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రకృతికి విఘాతమంటున్న విద్యార్థి, ప్రతిపక్ష, ప్రజాసంఘాలు

Mar 26, 2024 - 18:07
 0
హైకోర్టు భవన నిర్మాణానికి రేపే సీఎం శంకుస్థాపన?

నా తెలంగాణ, హైదరాబాద్: హైకోర్టు నూతన భవనం కోసం రాజేంద్ర నగర్​అగ్రికల్చర్​యూనివర్సిటీలో కేటాయించిన వంద ఎకరాల్లో బుధవారం సీఎం రేవంత్​రెడ్డి భూమి పూజ నిర్వహించిన శంకుస్థాపన ద్వారా పనులను ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో సకల సౌకర్యాల కల్పనతో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మంగళవారం మీడియాకు వివరించారు.  న్యాయవాదులు, న్యాయమూర్తులకు సౌకర్యాల కల్పనలో రాజీ పడేది లేదన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఈ విషయంలో మీనమేషాలు లెక్కించిందని మంత్రి మండిపడ్డారు. కాగా హైకోర్టు నిర్మాణంతో యూనివర్సిటీలోని పక్షులు, ఔషధ మొక్కలు, చెట్లకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థి, ప్రజా, ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం శంకుస్థాపనకు ముందు నిరసన, ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.