ఓటమి భయంలో అసద్.?  హిందూ ఓట్లకోసం తండ్లాట

మొన్న ఎంఐఎం తెలుగు పాట విడుదల నేడు హన్మంతుడి గుడిలో పూజలు గతానికి భిన్నంగా ఎగురుతున్న పతంగి  

May 4, 2024 - 17:13
 0
ఓటమి భయంలో అసద్.?  హిందూ ఓట్లకోసం తండ్లాట

నా తెలంగాణ, హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఓటమి భయం పట్టుకుంది. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా నకిలీ ఓట్లు తొలగింపు, మరోవైపు బీజేపీ అభ్యర్థి మాధవీలత అపూర్వమైన మద్దతుతో దూసుకెళ్తుండడంతో ఆయన తీవ్ర భయాందోళనకు గురవుతున్నాడు. ఎటు చూసినా.. వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఏం చేయాలో పాలు పోని అసద్ సరికొత్తగా హిందూ ఓట్ల వేటకు తెరలేపాడు. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ హిందువులను పట్టించుకోని ఎంఐఎం పార్టీ.. ఇప్పుడు అదే వర్గం ఓట్లకు వెంపర్లాడడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

తెలుగులో పాట విడుదల.. 

ఎంఐఎం నాయకులు, ముస్లింలు స్వతహాగానే ఉర్దూ మాట్లాడుతుంటారు. వారి ప్రసంగాలు, పలకరింపులు అన్నీ ఉర్దూ భాషలోనే సాగుతుంటాయి. కానీ, తాజాగా అసద్ ఎంఐఎం పార్టీ తెలుగు పాటను విడుదల చేసింది. నల్గొండ గద్దర్ స్వర సారథ్యంలో సాగిన పాట హిందువుల ఓట్లను ఆకర్షించే రీతిలో సాగింది. దీన్నిబట్టి పతంగి బాస్ గుండెల్లో ఎంత భయం గుబులు రేపుతుందో తేటతెల్లమవుతోంది.

గుళ్లో పూజలు.. 

హిందుత్వ భావజాలాన్ని, హిందూ దేవుళ్లపై పరుష పదజాలంతో విరుచుకుపడే ఓవైసీ శుక్రవారం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే చర్యకు పాల్పడ్డాడు. ప్రచారంలో భాగంగా మూసారాంబాగ్‌లో తిరుగుతున్నాడు.  ప్రచారంలో భాగంగా ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి వెళ్తున్నారు. అప్పటికే గుమిగూడిన ఎంఎంఐ కార్యకర్తలు అసద్ ను పూజలు చేయాలని కోరారు. అసద్ కూడా అందుకు సమ్మతించి పూజారి మెడలో వేసిన మాలను స్వీకరించి, ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అనంతరం వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.