సరబ్​ కు ఘన స్వాగతం సన్మానించిన కేంద్రమంత్రి మన్సూఖ్​ మాండవీయా

సొంత జిల్లా, గ్రామంలోనూ ఘన స్వాగతానికి ఏర్పాట్లు

Aug 1, 2024 - 21:26
 0
సరబ్​ కు ఘన స్వాగతం సన్మానించిన కేంద్రమంత్రి మన్సూఖ్​ మాండవీయా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒలింపిక్​ కాంస్య పతక విజేత సరబ్​ జీత్​ సింగ్​ భారత్​ కు చేరుకున్నారు. న్యూ ఢిల్లీలో ఆయనకు గురువారం క్రీడా శాఖల మంత్రి మన్సూఖ్​ మాండవీయా ఘన స్వాగతం పలికారు. అనంతరం సరబ్​ జ్యోత్​ ను సన్మానించారు. 
 
పారిస్​ లో సరబ్​ 10మీటర్ల ఎయిర్​ రైఫిల్​ మిక్సడ్​ ఈవెంట్​ లో కొరియాకు చెందిన లీ వోన్హో, ఓహ్​ యెజిన్​ లను 16–10తో ఓడించారు. భారత్​ కు రెండో పతకాన్ని అందించారు. 
 
మరోవైపు సరబ్​ జ్యోత్​ కు తన స్వస్థలమైన అంబాలాలో స్వాగతం పలికేందుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతని స్వగ్రామం ధీన్​ గ్రామంలో భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సరబ్​ జోత్​ రాక కోసం ఎదురు చూస్తున్నారు. 
 
కాగా సరబ్​ తోపాటు అర్జున్​ బాబౌతా, రమితా జిందాల్​, ఎలవెనిల్​ వరివన్​, రిథమ్ సాంగ్వాన్, సందీప్ సింగ్, ర్జున్ సింగ్ చీమాలు కూడా స్వదేశానికి తిరిగి వచ్చారు.