దేశానికి పతకమే తన లక్ష్యం
గగన్, ధోనీ, మనుభాకర్ లే తనకు స్ఫూర్తి ఏయిర్ రైఫిల్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాలే
పారిస్: భారతదేశానికి విజయం అందించాలనేదే తన తపన అన్నారు. తాను గగన్ నారంగ్, మనుభాకర్,క్రికెటర ధోనీలను స్ఫూరణగా తీసుకున్నానని చెప్పారు. భారత్ కు ఒలింపిక్స్ –2024 పురుషుల 50 మీటర్ల ఏయిర్ రైఫిల్ పోటీలో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుసాలే విజయం అనంతరం మాట్లాడారు.
ఎంతోమాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. తన విజయంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన మనసులో దేశ ప్రతిష్ఠను పెంచాలనే కోరిక మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు అది సాధ్యపడిందని స్వప్నిల్ తెలిపారు. 2012లో ఒలింపిక్స్ లో గగన్ నారంగ్ రైఫిల్ ఈవెంట్ లో భారత్ కు కాంస్య పతకం అందించడం తన మనసులో నిలిచిపోయిందన్నారు. ఆయనలాగే తాను కూడా రైఫిల్ లో పతకాన్ని సాధించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అన్నయ్య (గగన్ నారంగ్) తో చాలాయేళ్లు ఉన్నానని పేర్కొన్నారు. ఆయన నుంచి ప్రేరణ పొందానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తనకు అనేక విషయాల్లో వ్యూహ, ప్రతివ్యూహలను వివరించారని తెలిపారు. గగన్ సహాయాన్ని, భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినందుకు తనకు గర్వంగా ఉందని స్వప్నిల్ కుసాలే తెలిపారు.