నా తెలంగాణ, షాద్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని పోమాల్ పల్లి గ్రామ సమీపం నుంచి 765 కె వి ఏ హైటెన్క్షన్ విధ్యుత్ లైన్ నిర్మాణం ఆపాలంటూ పోమాల్ పల్లి గ్రామస్తులు శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వినతి పత్రం అందజేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను గ్రామస్తులు కలిశారు.
మహేశ్వరం నుంచి జడ్చర్ల వరకు నిర్మిస్తున 765 కె వి ఏ హైటెన్క్షన్ విద్యుత్ లైన్ మార్కింగ్ మార్చాలని కోరారు. మొదట మార్కింగ్ ఇచ్చిన విధంగానే విద్యుత్ లైన్ నిర్మాణం చేపటాలని గ్రామ సమీపంలో నుంచి విద్యుత్ లైన్ వస్తే గ్రామ విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.
గ్రామానికి అతి సమీపంలో నుంచి విద్యుత్ లైన్ వేస్తే భవిష్యత్తులో ప్రమాదాలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ లైన్ ను తమ గ్రామానికి దూరంగా వేయించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం షాద్ నగర్ ఆర్డిఓకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణయ్యయాదవ్, మాజీ ఉపసర్పంచ్ అనుమగల రమేష్, పూజారి రవి శర్మ, బుర్రి భూపాల్ రెడ్డి, ఫణీంద్ర, ముత్యాల్ రెడ్డి, కర్ణకోట శ్రీనివాసులు, మహేష్, అంజయ్య, మస్తాన్, ఎల్లయ్య, బండ కృష్ణ, మల్లయ్య, యాదయ్య, దాసరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.