రాజ్యాంగంపై చర్చ జరుగుతుంది కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు

Union Minister Kiran Rijiju will discuss the Constitution

Dec 2, 2024 - 16:47
 0
రాజ్యాంగంపై చర్చ జరుగుతుంది కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సోమవారం సమావేశాల వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడారు. 13, 14 న లోక్​ సభలో, 16, 17న రాజ్యసభలో చర్చ  జరుగుతుందన్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్​ సమావేశాలు సజావుగా జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకోవడం మంచిది కాదన్నారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు కూడా అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. అయినా కూటమి పార్టీలు లేనిపోని ఆందోళనలు, నిరసనలు సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకోవడం మంచిది కాదని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు పేర్కొన్నారు.