ఎఐఎఫ్ రూ.4.5 లక్షల కోట్లు
తొలి అర్థభాగం నివేదికలో స్పష్టం రియల్ రంగం వాటా అత్యధికం ఎఐఎఫ్ చైర్మన్ అనూజ్ పూరి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్థభాగంలో రూ. 4.5 లక్షల కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడుల నిధులను ఆకర్షించినట్లు ఎఐఎఫ్ (ఆల్టర్నేటివ్ ఇన్వస్ట్ మెంట్ ఫండ్) గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. సోమవారం అనరాక్ రీసెర్చ్ డేటాను సెబీ వెల్లడించింది. ఈ సందర్భంగా అనూజ్ పురి పలు వివరాలను అందించారు. మొత్తం రూ. 4,49,384 కోట్ల ఎఐఎఫ్ పెట్టుబడులలో అత్యధిక వాటాను రియల్ ఎస్టేట్ రంగానికి దక్కిందన్నారు. ఈ రంగంలో రూ. 75,468 కోట్లు ఎఐఎఫ్ పెట్టుబడుల వాటాను కలిగి ఉంది.
ఐటీసెక్టార్ రూ. 27,815 కోట్లు, ఆర్థిక సేవలు రూ. 25,782 కోట్లు, ఎన్‌బిఎఫ్‌సిలు రూ. 21,503 కోట్లు, బ్యాంకులు రూ. 18,242 కోట్లు, ఫార్మా రూ. 17,272 కోట్లు, ఎఫ్‌ఎంసిజి రూ. 80, 11 కోట్లు, రిటైల్ రూ. 11,389 కోట్లు, పునరుత్పాదక ఇంధనం రూ. 10,672 కోట్లు, ఇతర రంగాలు రూ. 2,29,571 కోట్లుగా ఎఐఎఫ్ పెట్టుబడులను ఆకర్షించాయన్నారు. 2013 నుంచి 2024 వరకు ఎఐఎఫ్ సెక్టార్ ప్రకారం 83.4 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని స్పష్టం చేశారు.