ఆశయ సాధనలో కలాం సేవలు స్ఫూర్తిదాయకం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
Union Minister G.Kishan Reddy's Kalam services are inspiring in achieving ambition
నా తెలంగాణ, హైదరాబాద్: ఆశయాల సాధనలో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన మహానీయుడు మాజీ రాష్ర్టపతి ఏపీజే అబ్దుల్ కలాం (మిస్సైల్ మ్యాన్) అని తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.
ప్రముఖ శాస్ర్తవేత్తగా, క్షిపణి వ్యవస్థలకు ఆజ్యం పోసిన వారిలో అబ్దుల్ కలాం ఒకరని కొనియాడారు. ఆయన సేవలకు గుర్తించిన దేశం ఆయనకు అత్యున్నత పదవి రాష్ర్టపతిని ఇచ్చి గౌరవించుకున్నామని మంత్రి తెలిపారు.
ప్రజా జీవితాల్లో ఆయన స్ఫూర్తి నింపారన్నారు. కలాం ఆశయాలు, విలువలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆయన సేవలను కొనియాడారు.