తీహార్​ జైలు 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​!

125 prisoners of Tihar Jail are HIV positive!

Jul 27, 2024 - 13:50
 0
తీహార్​ జైలు 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని తీహార్​ జైలులో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా గుర్తించారు. 200మంది ఖైదీలు సిఫిలిస్​ లక్షణాలతో బాధపడుతున్నారనే సంచలన విషయం బయటికి వచ్చింది. ఈ విషయంపై శనివారం తీహార్​ జైలు డీజీ సతీష్ గోల్చా పలు విషయాలను వెల్లడించారు. తాను నియమితమైన తరువాత మే, జూన్​ లలో 10,500మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా తేలిందన్నారు. అయితే వీరు జైలుకు వచ్చినప్పటికే హెచ్​ ఐవీ సోకిందని వెల్లడించారు.

తీహార్​ జైలులో తీహార్​, రోహిణి, మండోలి అనే మూడు బ్లాకులున్నాయి. మూడు జైళ్లలో కలిపి 14వేలమంది ఖైదీలు ఉన్నారు. టీబీ కేసులు నమోదు కాలేదన్నారు. అదే సమయంలో మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్​ పరీక్షలు కూడా నిర్వహించామన్నారు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీలోని సఫ్దర్​ జంగ్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నామని డీజీ సతీష్​ గోల్చా తెలిపారు.