అమర్ నాథ్ ను దర్శించుకున్న 4.45 లక్షలమంది భక్తులు
4.45 lakh devotees visited Amarnath
శ్రీనగర్: అమర్ నాథ్ దర్శనాన్ని శుక్రవారం వరకు 4.45 లక్షలమంది భక్తులు చేసుకున్నట్లు క్షేత్ర ట్రస్ట్ శనివారం వెల్లడించింది. శనివారం 1771 మంది యాత్రికుల బృందం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి శనివారం ఉదయం బయలుదేరిందని తెలిపింది. 63 వాహనాల కాన్వాయ్ లో భద్రత మధ్య తెల్లవారు జామున 3.25 గంటలకు భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికులు దర్శనానికి తరలివస్తున్నారని తెలిపారు. ఇది 30వ బ్యాచ్ అని పేర్కొన్నారు. 999మంది పహిల్గామ్, 772 మంది గందర్ బల్ మార్గం ద్వారా వస్తున్నారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభం కాగా ఆగస్టు 19న ముగియనుంది.