కమిషనర్ల నియామకాన్ని రద్దు చేయలేం
తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు విచారణ 21కి వాయిదా
నా తెలంగాణ, ఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని రద్దు చేయలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి కేసు విచారణను మార్చి 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నియామకాలపై విచారణ చేపట్టింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలను రద్దు చేయాలంటూ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దాఖలు చేసింది. కమిషనర్ల నియామకాల రద్దు, స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఏడీఆర్‌తోపాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జయఠాకూర్ కూడా ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి రూపొందించిన కొత్త చట్టంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని సెలక్షన్ కమిటీ నుంచి మినహాయించారని తెలిపారు. అటువంటి పరిస్థితిలో, ఈ ప్రక్రియ సరైంది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీలో సీజేఐ ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు.