అహల్యాభాయ్ సేవలను ఎనలేనివి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
Union Minister G.Kishan Reddy can't count Ahlyabhai's services
నా తెలంగాణ, హైదరాబాద్: భారతదేశ చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడంలో రాణి అహల్యాభాయ్ హోల్కర్ (రాజమాత) సేవలు ఎనలేనివని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కొనియాడారు. మంగళవారం రాణి అహల్యాభాయ్ జయంతి సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. దేశమంతటా ఆమె నిర్మించిన దేవాలయాలు నిర్మించడం, పునరుద్ధరించడంలో విశేష కృషి చేసిందన్నారు. దేశ ప్రజలు రాజమాతను స్ఫూర్తిదాయకంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాజిక సంక్షేమం కోసం ఆమె ఆధ్వర్యంలో అనేక ధర్మశాలలు నిర్మితమయ్యాయన్నారు. ఆమె నిర్మించిన దేవాలయాలు వాస్తుకు ప్రసిద్ధి అన్నారు. ఈ దేవాలయాల వాస్తు ప్రస్తుత తరానికి కూడా ఆదర్శంగా నిలబడడం గర్వించదగ్గ విషయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాణి అహల్యాభాయ్ సేవలను కొనియాడారు.