రూ. 100 కోట్ల పసిడి స్కామ్​

సీసీఎస్​ ముందు బాధితుల ఆందోళన

Jun 23, 2024 - 21:51
 0
రూ. 100 కోట్ల పసిడి స్కామ్​

నా తెలంగాణ, హైదరాబాద్​: మహానగరంలో మరో పసిడి మోసం బయటపడింది. బాధితులు ఆదివారం సీసీఎస్​ ముందు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితుల వివరాల ప్రకారం.. ప్రహణేశ్వరి ట్రడేర్స్​ ఎండీ రాజేశ్​ తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. తమ వద్ద నుంచి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు మోసం చేసినట్లు వెల్లడించారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయని అంతేగాక వారం వారం లాభాల్లో వాటాలను కూడా అందజేస్తానని తమను మోసం చేశాడని వాపోయారు. మొత్తం రూ. 100 కోట్ల వరకు స్కామ్​ చేసి పరారయ్యాడని ఆరోపించారు. పెట్టిన సొమ్ముకు ఐదు నెలల్లోనే రెట్టింపు చేస్తానని నమ్మించాడని వాపోయారు. రెండు నెలలపాటు తమకు డబ్బులు చెల్లించిన రాజేశ్​ అటు తరువాత తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు. అయితే తప్పించుకొని తిరుగుతున్న రాజేశ్​ ను ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు సీసీఎస్​ ముందు ధర్నా నిర్వహించారు.