తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
Tiranga was the Vice President who started the bike rally
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధాని ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపులో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉపరాష్ర్టపతి జగదీప్ ధంకర్ అన్నారు. మంగళవారం భారత మండపం నుంచి హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ర్టపతి జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ర్టపతి మాట్లాడుతూ.. ప్రజలంతా దేశ ఐక్యతను చాటుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ యాత్ర చేపట్టామన్నారు. యాత్రకు విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ఈ ఉత్సవంలో ఇప్పటివరకు 23 కోట్ల ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయగా, 6 కోట్ల మంది ప్రజలు తమ సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా.కామ్’లో అప్ లోడ్ చేయడం అభినందనీయమన్నారు.
ఈ ర్యాలీ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షేకావత్, కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆగస్టు 15న ముగియనుంది.