ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు నమోదు
నా తెలంగాణ, హైదరాబాద్: మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై కేసు నమోదైంది. హైకోర్టు సీనియర్ లాయర్ వేదుల వెంకటరమణ తరఫున ఎమ్మెల్యే బలాల బెదిరింపులకు దిగుతున్నారని యాదగిరి అనే వ్యక్తి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఓ ల్యాండ్ విషయంలో అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని లాయర్ వెంకటరమణ మోసం చేశారని, రూ.14 కోట్లు డిమాండ్ చేసి రూ.10 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తీర్పు అనుకూలంగా రాకపోగా డబ్బులు ఇవ్వాలని కోరితే.. ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. దీంతో వెంకటరమణ, బలాలపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. విచారణ చేపట్టారు.