ప్రభుత్వ సంస్థల బలోపేతమే లక్ష్యం
The aim is to strengthen government institutions
- 4 రెట్ల వృద్ధిని సాధించిన 77 ప్రభుత్వ రంగ సంస్థలు
- సత్ఫలితాలిస్తున్న ప్రధాని మోదీ సంస్కరణల చర్యలు
- సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ నివేదిక వెల్లడి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణను పక్కన పెడుతూ ప్రభుత్వ సంస్థల బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత నాలుగేళ్లలో 77 ప్రభుత్వ రంగ సంస్థలు 4 రెట్లు వృద్ధిని సాధించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఇటీవలే ఓ నివేదికను విడుదల సందర్భంగా ఈ విషయం వెలుగులోకొచ్చింది.
వృద్ధిని సాధిస్తున్న వాటిలో బ్యాంకులు, బీమా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం అన్ని సంస్థల క్యాపిటలైజేషన్ పెరిగి రూ. 73 లక్షల కోట్లకు చేరుకుంది. పీఎస్‌యుల పనితీరు గణనీయంగా మెరుగుపడి, మూలధన వ్యయం పెరిగింది. సీపీఎస్‌ఇల పనితీరుకు అనుగుణంగా నిర్వహణ ప్రోత్సాహకాలు ఉండడంతో సంస్థల పనితీరు కూడా మెరుగ్గా ఉంది.
సమర్థవంతమైన పెట్టుబడి విధానంతోనే వృద్ధి సాధ్యమవుతోంది. అదే సమయంలో ఉత్పత్తి పెరుగుదల కూడా ఇందుకు దోహదపడుతోంది. గతేడాది మూలధన వసూల్లు రూ. 30వేల కోట్లుగా నమోదు కాగా,ఈ యేడాది అవి కాస్తా రూ. 50వేల కోట్లకు చేరుకున్నాయి.
కాగా ఈసారి బడ్జెట్ లో కూడా గతంలోని విధానాన్నే అనుసరిస్తూ పెట్టుబడుల ఉపసంహరణ రశీదులకు స్పష్టమైన లక్ష్యాన్ని ఇవ్వడం కూడా ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇదే సమయంలో పెట్టుబడి ఉపసంహరణ, ఆస్తి మానిటైజేషన్ నుంచి రసీదులతో సహా మూలధన రశీదుల కోసం బడ్జెట్‌ను అందిస్తుంది.
ప్రభుత్వం దేశీయ సంస్థల సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న పలు పథకాలు సత్ఫలితాలను సాధిస్తుండడంతో రానున్న పదేళ్లలో మూసుకునే దిశగా ఉన్న సంస్థలే టాప్ దేశంలో టాప్ టెన్ లో నిలిచినా ఆశ్చర్య పోనక్కరలేదని ఆర్థిక నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.