శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో రెండు చోట్ల ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. అనంత్ నాగ్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టగా, ఖన్యార్ లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఉగ్రవాదులు శుక్రవారం పలువురు కార్మికులపై దాడికి పాల్పడ్డవారు వీరేనని అనుమానిస్తున్నారు.
ఇంటలిజెన్స్ పక్కా సమాచారం మేరకు అనంత్ నాగ్ లోని ఇద్దరు ఉగ్రవాదులున్న ఇంటిని భద్రతా బలగాలు శనివారం వేకువజామున కనిపెట్టి చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతీకా భద్రతా బలగాలు కూడా దాడులకు దిగాయి. చాలా సమయం ఇరువురి మధ్యకాల్పులు జరగ్గా ఎట్టకేలకు భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
శ్రీనగర్ లోని ఖన్యార్ లో కూడా ముగ్గురు ఉగ్రవాదులు, ఒక స్థానికేతర ఉగ్ర కమాండర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతాబలగాలు ఉగ్రవాదులున్న ఇంటిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. భారీగా కాల్పుల శబ్ధాలు వినిపిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ ఆపరేషన్ పోలీసులు, సీఆర్పీఎఫ్ ల ఆధ్వర్యంలో కొనసాగుతుంది.