బీజేపీ తొలి జాబితా విడుదల 99మందికి అవకాశం
99 people are likely to release the first list of BJP
ముంబాయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది. 99మంది పేర్లను ప్రకటించింది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, కమతి నుంచి బవాన్‌కులే, కనక్‌వాలి స్థానం నుంచి నితీశ్ నారాయణ్ రాణే, ఘట్‌కోపర్ వెస్ట్ నుంచి రామ్ కదమ్ లు పోటీకి దిగనున్నారు. ఇందులో 6 సీట్లు ఎస్టీకి, 4 సీట్లు ఎస్సీకి, 13 స్థానాలు కేటాయించగా, 11 మంది కొత్తవారికి బీజేపీ టికెట్‌పై తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నిచ్చింది. మహారాష్ట్రలో ఎన్డీయే మధ్య సీట్ల షేరింగ్ లో బీజేపీ 155, శివసేన 78, ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి.