డిజిటల్ మోసాల్లో భారతీయులే సమిధలు
తప్పించుకుంటున్న అసలు నిందితులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: డిజిటల్ అరెస్టులలో భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన భారతీయులే సమిధలుగా మారుతున్నారు. ఈ కేసుల్లో వారినే ఉచ్చులోకి ఇరికిస్తున్న విదేశీ శక్తులు తప్పించుకుంటున్నాయి. ఈ విషయాన్ని భారత్ కు చెందిన పలు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కాంబోడియా, దుబాయ్ కేంద్రంగా ఆర్థిక మోసాల ద్వారా నగదును విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. మయన్మార్, కాంబోడియా, వియత్నాం, లావోస్ లలో ఈ నెట్ వర్క్ వెలుగులోకొచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిన భారతీయులనే డిజిటల్ మోసాలకు ఎంచుకుంటున్నారు. దీంతో నిందితులుగా భారతీయులే చిక్కుతున్నారు తప్ప అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. పోలీసులని, ఇన్వెస్టిగేషన్ అని, బహుమతులు అని, లక్కీ డ్రాలు, కొరియర్ లు, రేషన్ కార్డులు, బ్యాంకు అధికారులు, ప్రభుత్వ పథకాల పేరిట అనేక రకాలుగా డిజిటల్ మోసాలకు తెరలేపుతున్నట్లు అధికారులు గుర్తించారు.