ఇంధన ధరలపై నిరసన గుండెపోటుతో బీజేపీ ఉపాధ్యక్షుడు మృతి

BJP vice-president dies of heart attack in protest over fuel prices

Jun 17, 2024 - 18:59
 0
ఇంధన ధరలపై నిరసన గుండెపోటుతో బీజేపీ ఉపాధ్యక్షుడు మృతి

బెంగళూరు: ఇంధన ధరలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న ఆందోళనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్ణాటక ఆ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు, సీనియర్​ నాయకుడు ఎంబి. భాణుప్రకాశ్​ గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పెట్రోల్​, డిజీల్​ ధరలకు నిరసనగా పార్టీ నేతృత్వంలో బెంగళూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం సిద్ధిరామయ్యపై విమర్శలు చేశారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బు ఉంటే జనన, మరణ ధృవీకరణ పత్రాలు, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకం, విద్యుత్ ధరలు ఎందుకు పెంచారని సీఎం సిద్ధి రామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆందోళన అనంతరం ఆయన కారులో కూర్చొంటుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే స్పందించిన పార్టీ వర్గాలు ఆయన్ను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.