యాచకులను పంపొద్దు పాక్​ కు స్పష్టం చేసిన యూఏఈ

95 శాతం మంది పాక్​ యాచకులే! సెనేట్​ స్టాండింగ్​ కమిటీలో యూఏఈ నివేదికను వెల్లడించిన పాక్​ విదేశాంగ కార్యదర్శి అర్షద్​

Aug 6, 2024 - 16:44
 0
యాచకులను పంపొద్దు పాక్​ కు స్పష్టం చేసిన యూఏఈ

ఇస్లామాబాద్​: పాక్​ నుంచి సౌదీ అరేబియాకు వచ్చే  రోగులను, యాచకులను వెంటనే నిలిపివేయాలని యూఏఈ పాక్​ కు స్పష్టం చేసింది. ఈ తరహా పర్యటనలు సౌదీ, ఖతార్​, కువైట్​ లలో ఎక్కువగా ఉంటున్నాయని వీరి రాకపై యూఏఈ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు పాక్​ విదేశాంగ కార్యదర్శి అర్హద్​ తెలిపారు. యూఏఈ దేశాల్లో 95 శాతం యాచకుల్లో పాక్​ కు చెందిన వారే ఉండడం గమనార్హం. 

పాక్​ సెనేట్​ స్టాండింగ్​ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన పాక్​ ప్రభుత్వానికి వెల్లడించారు. సెప్టెంబర్​ 2023నే యూఏఈ దేశాలు పాక్​ కు స్పష్టం చేస్తూ విడుదల చేసిన నివేదికను అర్షద్​ బహిర్గతం చేశారు. 


తీర్థయాత్రల నెపంతో పాక్​ నుంచి ఆయా దేశాలకు వస్తూ వీసా గడువు ముగిసినా యాచక వృత్తిలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నాయని గుర్తించారు. ఇప్పటికే చాలామందిని అరెస్టు కూడా చేశారని, వారంతా జైళ్లలో మగ్గుతున్నారని వారిని వెనక్కి పిలిపించాల్సిన అవసరం ఉందన్నారు. 


యూఏఈకి వెళుతున్న వారిలో కార్మికులుగా వెళుతున్న వారు కూడా ఉన్నారని అన్నారు. వీరికి ఎలాంటి అర్హతలు లేకపోయినా అనధికారికంగా వీసాలు పొంది వెళుతున్నారని తెలిపారు. వీరంతా యాచక వృత్తిని ఆశ్రయించడం పట్ల యూఏఈ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తూ అలాంటి వారిని పంపించవద్దని పాక్​ కు స్పష్టం చేశాయన్నారు. 

రంతా యాచక వృత్తిని ఆశ్రయించడం పట్ల యూఏఈ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తూ అలాంటి వారిని పంపించవద్దని పాక్​ కు స్పష్టం చేశాయన్నారు.