నెతన్యాహుపై అరెస్ట్​ వారెంట్​ జారీ!

యూఎన్​ క్రిమినల్​ కోర్టుపై  మండిపడ్డ ఇజ్రాయెల్​, అమెరికా

Nov 21, 2024 - 18:24
 0
నెతన్యాహుపై అరెస్ట్​ వారెంట్​ జారీ!

హేగ్: మానవాళికి వ్యతిరేకంగా గాజాలో యుద్ధ నేరానికి పాల్పడినందుకు గాను ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రిపై నెదర్లాండ్స్​ హేగ్​ అంతర్జాతీయ క్రిమినల్​ కోర్టు (యూఎన్​ క్రిమినల్​ కోర్టు) అరెస్టు వారెంట్​ చేసింది. గురువారం అరెస్టు వారెంట్​ ను జారీ చేస్తూ తీర్పును వెలువరించింది. యూఎన్​ తీర్పుపై ఇజ్రాయెల్​, అమెరికాలు మండిపడ్డాయి. ఇజ్రాయెల్​, అమెరికాలో యూఎన్​ క్రిమినల్​ కోర్టులో సభ్యులు కానందున చిక్కులు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఓవైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతుండగా నెతన్యాహుపై అరెస్ట్​ వారెంట్​ మరింత ఉద్రిక్తతలు దారితీయొచ్చనే అభిప్రాయాలు కూడా నెలకొన్నాయి. అంతర్జాతీయ క్రిమినల్​ కోర్టు చీఫ్​ కరీం ఖాన్​ పై యూఎస్​ అధ్యక్షుడు జో బైడెన్​ విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్​ కు తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుకు మద్ధతు తెలిపారు. 

ఈ సందర్భంగా కోర్టు పలు విషయాలను ఊటంకించింది. యుద్ధం సందర్భంగా సామాన్య ప్రజలకు నీరు, వైద్యం, ఔషధం, సామాగ్రి, ఇంధనం, విద్యుత్​ వంటి వాటికి ఇజ్రాయెల్​ పూర్తి ఆటంకాలు కలిగించిందన్నారు. అన్నింటిపై ఆధారాలున్నాయని పేర్కొన్నారు. యూన్​ క్రిమినల్​ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసం నెతన్యాహు, మంత్రియోవ్​ గల్లంట్​ లపై వారెంట్లు జారీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.