సాహసోపోతేమైన నిర్ణయాలకు కేరాఫ్ మోదీ
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
లక్నో: మోదీ హయాంలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అన్ని వర్గాలు నారీశక్తికి ప్రోత్సాహం లభించాలని, అన్యాయం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే ట్రిపుల్ తలాక్ ను తీసుకువచ్చామని మంత్రి స్పష్టం చేశారు. యూపీలోని బీజేపీ అభ్యర్థి బోలా సింగ్ కు మద్దతుగా బుధవారం ఎన్నికల సభలో మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. ప్రజా ఆకాంక్షల మేరకే మోదీ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఆశీర్వదించిన ప్రజలు ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి మరో ఐదేళ్లు అధికారాన్ని ఇచ్చారన్నారు. 2024లోనూ ప్రజాశీర్వాదం బీజేపీ మోదీ వెంటే ఉందని తెలిపారు. 2024 ఎన్నికల తరువాత సమాజ్ వాదీ పార్టీ అంతం ఖాయమని మంత్రి అన్నారు.
కాంగ్రెస్, కూటమి పార్టీలు దేశాన్ని దోచుకుతినే పార్టీలని మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. వారు అధికారంలో ఉన్న ఏ రాష్ర్టంలో చూసినా అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. అందుకే మోదీ నేతృత్వంలోని బీజేపీకి అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా విజయవంతంగా అమలు చేసే ఏకైక నిరుపేదల శ్రేయస్సు కోరే పార్టీ అని తెలిపారు. భవిష్యత్తులో దేశం నుంచి అవినీతి, అక్రమ, కుటుంబ పార్టీల మనుగడ సాగించలేవని తెలిపారు.
రక్షణ రంగంలో బలోపేతంతో భారత్ సత్తాను చాటుకుంటున్నామన్నారు. 2014కు ముందు దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవో చెప్పనవసరం లేదన్నారు. అటుపిమ్మట ప్రస్తుతం దేశ రక్షణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు చూస్తూ అనుభవిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదం, శాంతి సామరస్యాలను భంగం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని మంత్రి రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.