ప్రతికూలతలున్నా 7శాతం వృద్ధి సాధ్యమే

ఫిక్కీ నివేదిక విడుదల

Jul 18, 2024 - 15:01
Jul 18, 2024 - 15:02
 0
ప్రతికూలతలున్నా 7శాతం వృద్ధి సాధ్యమే

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఎఫ్​ ఐసీసీఐ (ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ చాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ–ఫిక్కీ) గురువారం భారత వృద్ధి రేటును 7 శాతంగా నివేదిక విడుదల చేసింది. అనేక ప్రతికూలతలు 204–25లో ఉన్నప్పటికీ వృద్ధి రేటు (జీడీపీ)కి ఎలాంటి ఢోకా లేదని పేర్కొంది. 

2023–24లో గతంలో కంటే వృద్ధి రేటు 1.4 శాతం పెరిగిందని తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఈ రంగంలో 3.7 శాతం వృద్ధిని సాధించే అవకాశం ఉందని పేర్కొంది. 

ఇటీవలే భారత వృద్ధి రేటుపై పలు ఆర్థిక సంస్థలతోపాటు, ఆర్బీఐ కూడా నివేదికలు వెల్లడించింది. ప్రస్తుతం పారిశ్రామిక రంగం కూడా తమ నివేదికలో భారత వృద్ధి సాధ్యమేనని తెలిపింది.