పట్టాలు తప్పిన దిబ్రూగఢ్​ ఎక్స్​ ప్రెస్​

పట్టాలు తప్పిన 15 బోగీలు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు.. కొనసాగుతున్న రెస్క్యూ చర్యలు

Jul 18, 2024 - 16:04
Jul 18, 2024 - 16:27
 0
పట్టాలు తప్పిన  దిబ్రూగఢ్​ ఎక్స్​ ప్రెస్​

లక్నో: యూపీలోని గోండాలో పెద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గురువారం చండీగఢ్‌ నుంచి గోరఖ్‌పూర్‌ మీదుగా అస్సాం వెళ్తున్న దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​, అధికారులు రెస్క్యూ చర్యల కోసం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు, వైద్య బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. 
యూపీలోని గోండా గోరఖ్​ పూర్​ రైల్వే సెక్షన్​ లోని మోతీగంజ్​ లో మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం ద్వారా ఈ ట్రాక్​ పై ప్రయాణించే రైళ్లకు అంతరాయం ఏర్పడింది.