ఇద్దరు యువరాజులు దోచుకునేందుకు సిద్ధం

ఒకరు హస్తిన.. మరొకరు బిహార్​ లో గోద్రా నిందితులను కాపాడిన లాలూ లాంతరు యుగానికి వెళ్లొద్దు దర్బాంగ సభలో ప్రధాని మోదీ

May 4, 2024 - 19:05
 0
ఇద్దరు యువరాజులు దోచుకునేందుకు సిద్ధం

పాట్నా: దేశంలో యువరాజు ఒక్కరు కాదని ఒకరు ఢిల్లీలో ఉండగా, మరొకరు బిహార్​ లో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాహుల్​ గాంధీ,ఆర్జేడీ తేజస్వీ యాదవ్​ ల పేర్లు ప్రస్తావించకుండానే విమర్శించారు. ఒకరు దేశాన్ని మొత్తం తన ఆస్తిగా భావిస్తే, మరొకరు బిహార్​ నే తన ఆస్తిగా భావిస్తారని దోచుకుతినేందుకు ప్రయత్నిస్తుంటారని ప్రధాని మోదీ అన్నారు. 

శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్​ దర్భాంగ రాజ్‌మైదాన్‌లో బీజేపీ అభ్యర్థి గోపాల్‌ ఠాకూర్‌కు అనుకూలంగా ఎన్నికల సభలో  సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

ఇద్దరు యువరాజుల రిపోర్టు  కార్డులు ఒక్కటేనన్నారు. ఒకరు దేశాన్ని దోచుకుతింటే, మరొకరు రాష్ర్టష్ర్టాన్ని దోచుకుతినాలని చూస్తుంటారని ఆరోపించారు. రిజర్వేషన్లపై మాట్లాడుతూ, బాబా సాహెబ్​ అంబేద్కర్​, పండి నెహ్రూలు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. 

ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు తగ్గించలేమని మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేమని తెలిపారు. ఇద్దరు యువరాజులు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రధాని మోదీ జీవించి ఉన్నంత కాలం రిజర్వేషన్లను మార్చబోమన్నారు. 

గోద్రా ఘటనలో నిందితులను కాపాడేందుకు లాలూ ప్రసాద్​ యాదవ్​ ప్రయత్నించారని మండిపడ్డారు. వారసత్వ ఆస్తులను కూడా లాక్కునే కొత్త నాటకానికి కాంగ్రెస్​ పార్టీ తెరతీసిందని మండిపడ్డారు. 

బిహార్​ ప్రజలు అన్ని విధాలుగా ఆలోచించి మరోమారు లాంతరు యుగానికి వెళ్లవద్దని బీజేపీకి ఓటు వేసి అభివృద్ధి దిశగా ముందుకు వెళదామని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.