జవాన్లపై ఉగ్రదాడి ఐదుగురికి గాయాలు

సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగింపు కశ్మీర్​ సూరన్​ కోట్​ ప్రాంతంలో ఘటన సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగిస్తున్న ఆర్మీ, పోలీసులు

May 4, 2024 - 19:43
 0
జవాన్లపై ఉగ్రదాడి ఐదుగురికి గాయాలు

కశ్మీర్​ : కశ్మీర్​  పూంచ్​ లో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు భారీ దాడికి ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఉగ్రదాడులను తిప్పికొట్టారు. ఈ ఘటన సూరన్​ కోట్​ లోని సనాయ్​ గ్రామం గుండా వెళుతున్న ఆర్మీ కాన్వాయ్​ లోని రెండు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఐదుగురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, పోలీసు బృందాలు రంగంలోకి దిగి కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.