హెచ్ ఎంపీవీ మరో రెండు కేసులు నమోదు
Two more cases of H. MPV were registered
గాంధీనగర్/లక్నో: దేశంలో మరో రెండు హెచ్ ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. గురువారం గుజరాత్ లోని 8ఏళ్ల చిన్నారి, యూపీలోని 60ఏళ్ల వృద్ధురాలికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వివరించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వెలుగుచూశాక కేంద్ర, ఆయా రాష్ర్టాల వైద్యశాఖలు అప్రమత్తమయ్యాయి. మాస్క్ తప్పనిసరి చేశాయి. ఆయా రాష్ర్టాల్లో ఐసోలేషన్ వార్డులను ర్పాటు చేస్తున్నారు. మహారాష్ర్టలో 3, గుజరాత్ 1, కర్ణాటక 1, తమిళనాడు 2, పశ్చిమ బెంగాల్ 1, యూపీ 1, మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ ను జారీ చేసింది.