ఐక్యంగా పోరాడదాం.. బీజేపీకే విజయావకాశాలు ఎక్కువ

కేంద్రమంత్రి జేపీ నడ్డా

Jan 9, 2025 - 19:14
 0
ఐక్యంగా పోరాడదాం.. బీజేపీకే విజయావకాశాలు ఎక్కువ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. గురువారం 43 కమిటీలతో జేపీ నడ్డా సమావేశమై ఎన్నికల్లో ప్రచారం, ప్రజలకు, ఓటర్లకు దగ్గరయ్యే పలు సూచనలు, సలహాలను చేశారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. 26 ఏళ్ల తరువాత పార్టీని ఢిల్లీలో అధికారం తేవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టికెట్​ రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ప్రతిఫలం దక్కుతుందన్నారు.   ఈ సమావేశంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, విజయాంత్ పాండా, అల్కా గుర్జార్, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, మనోజ్ తివారీ, యోగేష్ చందోలియా, సతీష్ ఉపాధ్యాయ్, మంజిత్ సింగ్ సిర్సా, విజేంద్ర గుప్తా, కమల్జీత్ సెహ్రావత్, ప్రవీణ్ ఖండేల్వాల్, పవన్ శర్మ. హర్షవర్ధన్, బాన్సూరి స్వరాజ్, సోషల్​ మీడియా, అడ్వర్టైజ్​ మెంట్​, బూత్​ స్థాయి కమిటీ ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అతిత్వరలోనే బీజేపీ రెండో లిస్టు కూడా జారీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తొలి జాబితాలో 29మంది అభ్యర్థులకు చోటు దక్కింది.