గాజాలో ఐడీఎఫ్​ విధ్వంసం.. 50 మంది మృతి

IDF destruction in Gaza.. 50 people died

Jan 9, 2025 - 18:14
 0
గాజాలో ఐడీఎఫ్​ విధ్వంసం.. 50 మంది మృతి

గాజా సిటీ: గాజాలో ఐడీఎఫ్​ తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. ట్రంప్​ హెచ్చరికను సైతం బేఖాతరు చేసి హమాస్​ ఇజ్రాయెల్​ బందీలలో ఇద్దరినీ చంపడంతో ఐడీఎఫ్​ దాడులను తీవ్రతరం చేసింది. గురువారం చేసిన దాడిలో  50 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ దాడి ఖాన్​ యూనిస్​ పై జరిగింది. ఈ దాడిలో 8మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు కూడా మృతిచెందారు. ఐడీఎఫ్​ దాడితో అల్​ అక్సా, నాసర్​ లో ఆసుపత్రులను మూసివేశారు. దాడులను ఆపేందుకు ఖతార్​ యూఏఇ విదేశాంగ శాఖ మంత్రి షేక్​ అబ్దుల్లా బిన్​ జాయెద్​ ఇజ్రాయెల్​ మంత్రి గిడియాన్​ తో కలిసి కాల్పుల విరమణపై చర్చించారు. బందీల విడుదలపై హమాస్​ మొండిగా వ్యవహరిస్తూ ఇద్దరినీ చంపడమే ఇజ్రాయెల్​ లో మరింత ఆగ్రహానికి కారణమైన దాడులకు పాల్పడింది. ఐడీఎఫ్​ దాడులతో యూఎన్​ ఆందోళన వ్యక్తం చేసింది. ఆసుపత్రులపై దాడులు మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేయొద్దని స్పష్టం చేసింది. గాజాలో ఇప్పటివరకు 27 ఆసుపత్రులు, 12 వైద్య సదుపాయాలు అందజేస్తున్న భవనాలపై 136 దాడులు జరిగాయని యూఎన్​ పేర్కొంది.